తలసేమియా, సికిల్‌ సెల్‌ అనిమియాపై à°•à°¾à

admin/latest_updates_images/aa.jpg

తలసేమియా చిన్నారుల కోసం ఎంపీ నిధులను కేటాయిస్తాం
– సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణలో విద్య, వైద్యంకు పెద్ద పీట
– సంకల్ప సేవలు బేష్‌.. వారికి నా సహకారం ఏప్పుడూ ఉంటుంది
– రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మంః
జిల్లాలో తలసేమియాతో బాదపడుతున్న చిన్నారులు ఇబ్బందులకు, వారి సమస్యలకు శాస్వత పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. చిన్నారుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని, ఖమ్మం కేంద్రంగా చిన్నారులకు à°’à°• షెల్టర్‌ ఏర్టాపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని శ్రీశ్రీశ్రీ హోటల్‌ నందు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా, సికిల్‌ సెల్‌ అనిమియాపై కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపకురాలు పి.అనిత అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ 15 ఏళ్లుగా తలసేమియాపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సంకల్ప అనిత పని చేస్తుందని, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు మొదటి నుండి తన సహకారం ఉందని, ఇప్పుడు వారికి మరింత సహకారం అందించేందుకు తనపై పెద్ద బాధ్యత ఉందన్నారు. జిల్లాలో 260 మంది తలసేమియా చిన్నారులకు ఐరన్‌ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఐరన్‌ మిషన్‌ను తన ఎంపీ నిధుల నుండి ఖర్చు చేసి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మరో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధిరెడ్డి నిధులను కోరుతామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాలకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యంను బలోపేతం చేసేందుకు జిల్లాకో మెడికల్, నర్సింగ్‌ కళాశాల, ఇంజనీరింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో ఆసుపత్రులను బలోపేతం చేసుకొని వైద్య సేవలను మెరుగు పరుచుకున్నామని, తలసేమియాకు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుల దృష్టికి తలసేమియా చిన్నారుల సమస్యలను తీసుకెళ్లి అవి పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు. జాతీయ తలసేమియా వెల్ఫేర్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.ఎస్‌.అరోరా మాట్లాడుతూ దేశంలో 5 కోట్ల మంది తలసేమియా కారియర్స్‌ ఉన్నారని, ప్రతి సంవత్సరం 12 వేల మంది తలసేమియా మేజర్‌à°—à°¾ జన్మిస్తున్నారని అన్నారు. వీరికి రక్తం సేకరించడం చాలా కష్టంగా మారిందన్నారు. తలసేమియా జన్యుపరమైన వ్యాధి అని, వివాహానికి ముందు స్త్రీ, పురుషులు హెచ్‌ఎల్‌ఏ పరీక్షలు చేయించుకొని తలసేమియాను అరికట్టాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా తలసేమియా కారియర్‌ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు à°ˆ వ్యాదిని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహంచాలని, వ్యాధితో బాదపడుతున్న చిన్నారులకు ప్రభుత్వాలు అవసరమైన సాయం చేయాలని కోరారు. అనంతరం సంకల్ప స్వచ్ఛంద సేవాసంస్థ వెబ్‌ సైట్‌ను ఎంపీ రవిచంద్ర ప్రారంభించారు. అంతక ముందు డాక్టర్‌ జె.ఎస్‌.అరోరా తలసేమియా చిన్నారులను పరీక్షించి, వ్యాది పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందుల వినియోగం గురించి వివరించారు. à°ˆ కార్యక్రమంలో జాతీయ తలసేమియా సొసైటీ బాధ్యులు à°—à°—à°¨ దీప్‌ సింగ్, వైద్యులు à°¡à°¿.నారాయణ మూర్తి, సాయిభార్గవ్, లక్ష్మీ దీప, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ కోనా వెంకట్, సామాజికవేత్త అనురాధ, సంకల్ప సంస్థ ఉపాధ్యక్షురాలు పి.పావని, కోశాధికారి పి.రవిచంద్ర, ఉదయ్‌ భాస్కర్, వంశీ à°•à°¿à°°à°¿à°Ÿà±€ తదితరులు పాల్గొన్నారు.